JN: జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు అన్యాయం జరిగిందని జిల్లా బీసీ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. సోమవారం వారు స్టేషన్ ఘనపూర్ ఆర్డీవోకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు. 42% రిజర్వేషన్లు అని మాయమాటలు చెప్పిన ప్రభుత్వం, పాత రిజర్వేషన్ను తగ్గించిందని మండిపడ్డారు. జిల్లాలో బీసీ రిజర్వేషన్ 18% పరిమితం చేయడం విడ్డూరం అని వాపోయారు.