TPT: సూళ్లూరుపేట బజారువీధి నుంచి షార్ బస్టాండకు వెళ్లే మార్గంలోని రైల్వే గేట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరమ్మతుల కారణంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల వరకు మూసేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగించాలని కోరారు.