వినియోగదారులకు టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఫోన్కు వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్లను బ్లాక్ చేస్తే సరిపోదని సూచించింది. వాటిని గుర్తించి, వెరిఫై చేసి శాశ్వతంగా నిషేధించాలని వివరించింది. తప్పనిసరిగా డీఎన్డీ యాప్ నుంచి ఫిర్యాదు చేయాలని పేర్కొంది. ఇప్పటివరకు 21 లక్షల మొబైల్ నంబర్లను నిషేధించినట్లు ట్రాయ్ తెలిపింది.