KMM: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం ద్వారా పేద మహిళలకు అండగా నిలుస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు తుమ్మూరు రామిరెడ్డి తెలిపారు. వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో మంగళవారం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తుమ్మూరు రామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆడపడుచులకు చీరలను అందజేశారు.