JN: పాలకుర్తి తహసీల్దార్‌గా సూత్రం సరస్వతి నియామకం అయ్యారు. కలెక్టర్ కార్యాలయంలో సూపరిండెంట్‌గా పని చేసిన సరస్వతిని పాలకుర్తి తహసీల్దారుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు పాలకుర్తి తహసీల్దారుగా పనిచేసిన శ్రీధర్‌ను కలెక్టర్ కార్యాలయానికి సూపరిండెంట్‌గా బదిలీ చేశారు.