నంద్యాల బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా ఉపాధ్యక్షురాలిగా చెన్నమరాజ వసుంధర దేవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు గతంలో రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలిగా సేవలు అందించారు. ప్రస్తుతం శ్రీ శారద విద్యాపీఠం కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వసుంధర దేవి మాట్లాడుతూ.. బ్రాహ్మణ సేవా సమాఖ్యలో తన వంతు బాధ్యతలను నిర్వర్తిస్తానని తెలిపారు.