NLR: కావలి రూరల్ మండలంలోని రుద్రకోట శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో సోమవారం శ్రీ ఆంజనేయ స్వామి వారి ధర్మ ధ్వజం కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేద పండితులు నడుమ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.