MDK: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని ప్రతిరోజు సాయంత్రం వాహనాల తనిఖీలు తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం కొల్చారం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రూరల్ సీఐ జార్జ్, కొల్చారం ఎస్సై అహ్మద్ మొయినుద్దీన్ పాల్గొన్నారు.