W.G: ఆకివీడులో సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవ ఏర్పాట్లను సోమవారం ఇంఛార్జ్ తహసీల్దార్ ఫరూక్, ఎస్సై హనుమంతు నాగరాజు పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆలయ ఛైర్మన్ జె.ఎస్. కిమిడి నాగరాజు వారికి ఏర్పాట్ల గురించి వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.