KNR: తెలంగాణ ప్రభుత్వ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ విభాగం డైరెక్టర్గా మండలంలోని కొప్పరపు మల్లారెడ్డి–సుజాత దంపతుల పుత్రిక జయశ్రీ నియమితులై గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. చిన్న ఊరి ముద్దుబిడ్డగా ఎదిగి, ప్రతిభ, పట్టుదలలతో అత్యున్నత పదవిని అలంకరించిన జయశ్రీ విజయాన్ని గ్రామస్తులు అభినందనలతో నింపేశారు.