VZM: గత 16 నెలల్లో 2,467 మంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినట్లు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. విజయనగరంలో సోమవారం జరిగిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కుటుంబాలు, భవిష్యత్తు, వ్యక్తిత్వం పూర్తిగా దెబ్బతింటుందని, గంజాయి లేదా డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం ఏదైనా చేస్తే జైలుశిక్ష తప్పదన్నారు.