కృష్ణా: ఘంటసాల గ్రామంలో ‘రైతన్న మీకోసం’ వారోత్సవాల కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతులతో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ వారోత్సవాల ఉద్దేశాలను, 5 సూత్రాలను క్లస్టర్ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వారికి కరపత్రాలను అందజేశారు. వారిలో పాటు MLA బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.