E.G: రానున్న గోదావరి పుష్కరాలను సమర్థంగా నిర్వహించడానికి శాఖల వారీగా నిర్దిష్టమైన అంచనాలు రూపొందించాలని రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాలపై విభాగాల వారీగా అంచనాలు రూపొందించాలన్నారు.