ELR: జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెంకి చెందిన పొడపాటి కావ్య ఇటీవల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రోషన్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఒక అన్నగా ఉంటానని భరోసా ఇచ్చారు. కావ్య మృతిపై పోలీసులతో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తామన్నారు.