MBNR: జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 19 దరఖాస్తులు వచ్చినట్టు ఎస్పీ జానకి వెల్లడించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి వచ్చినటువంటి సమస్యలను విన్నానని, పోలీస్ స్టేషన్లో అధికారులతో మాట్లాడినట్లు ఎస్పీ వెల్లడించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.