NZB: బోధన్ మండలంలోని అమ్దాపూర్ ZPHS విద్యార్థులు జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన రిజ్వాన్ అనే విద్యార్థి ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కుస్తీలో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. విద్యార్థిని వైష్ణవి వెండి పతకం సాధించి జాతీయపోటీలకు సెలెక్ట్ అయిందని హెచ్ఎం సూర్యకుమార్ సోమవారం తెలిపారు.