ASR: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు ముడిపడి ఉన్నటువంటి సాంకేతికత సమస్యలను అధిగమించడానికి సెల్ టవర్లను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.