VSP: పేదల వైద్యుడిగా, ’20 రూపాయల డాక్టర్’గా పేరుపొందిన డాక్టర్ ప్రకాష్ రావు పార్థివదేహానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. విశాఖ జిల్లా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ ప్రకాష్‌రావు సేవలను గుర్తు చేసుకున్నారు.