SRCL: దొంగతనం కేసులో నిందితునికి సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ ఓ సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారని సీఐ కృష్ణ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 19, 2017న వడ్డేపల్లి సత్యం, దరిపెల్లి రమేష్ ఇంట్లో 8 తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా తీర్పు ఇచ్చారన్నారు.