ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థం పెద్ద కాలువ కట్ట మిడివేస్ట్ డంపింగ్ సమీపంలో పెద్దపులి తిరుగుతున్నట్లు స్థానికులు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఈ విషయంపై వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించారు. ఈ వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓల్డ్ వీడియో అని గిద్దలూరు FRO సత్యనారాయణరెడ్డి నిర్ధారించారు.