TG: సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్లను ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపింది. కాగా, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.