AP: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల మాజీ సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘ధర్మేంద్ర మరణం బాధాకరం. సినీ హీరోగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి’ అని పేర్కొన్నారు.