W.G: పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టెక్నోయాన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఛైర్మన్ కె.వి.నరసింహారావు తెలిపారు. కళాశాల విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.