ELR: అర్హులు దరఖాస్తు చేస్తే గృహ నిర్మాణానికి రుణాలు మాజూరు చేస్తామని ఎంపీడీవో మనోజ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సొంత ఇంటి స్థలం ఉన్న దరఖాస్తుదారులు తగిన ఆధారాలతో దరఖాస్తు చేయాలన్నారు. సొంత స్థలం లేని వారు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సతీష్, డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పాల్గొన్నారు.