GNTR: రైతుల సంక్షేమానికి నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురంలో సోమవారం సచివాలయ సిబ్బంది రైతులతో మాట్లాడారు. రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమై ఉందా అని ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యనమాల ప్రకాశ్ రైతులతో కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలు స్వీకరించారు.