AP: పల్నాడు జిల్లాలోని నాదెండ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రైతుల ఇళ్లకు వెళ్లి కార్యక్రమ లక్ష్యాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. మూస పద్దతులు విడనాడితేనే వ్యవసాయం పది కాలాలు నిలుస్తుందని తెలిపారు. లాభాలు అందించే పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని సూచించారు.