MBNR: మూసాపేట మండల కేంద్రంలో సోమవారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బస్సులు, శిల్పారామంలో వారి ఉత్పత్తులకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో పలువురు కాంగ్రెస్ నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.