E.G: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం చాగల్లు, దొమ్మేరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.