RR: షాద్నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామాన్ని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సందర్శించారు. ఇటీవల హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, హత్యకు దారి తీసిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భగవంతుడికే లేని కుల వివక్ష సమాజంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బాధితులకు తగిన శిక్ష పడితేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు.