సత్యసాయి: జిల్లాలో బాలుర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. కలెక్టరేట్లో కిషోర్ వికాసం కోసం ఏర్పాటు చేసిన ‘యువ’, ‘సఖీ’ గ్రూపుల లీడర్లకు ఆయన బ్యాడ్జ్‌లు అందజేశారు. 450 మంది నోడల్ టీచర్ల సహకారంతో ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జేసీ వివరించారు.