KMM: మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా బీఆర్ఎస్ నాయకులు మోరంపూడి ప్రసాదరావు సోదరుడు మధుసూదన రావు కుమార్తె రేష్మా చౌదరి వివాహం పృథ్వీ కృష్ణతో ఇటీవల జరగగా ఖమ్మం కార్పొరేషన్లో వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.