సత్యసాయి బాబా 100వ శత జయంతి ఉత్సవాలు ముగియడంతో పుట్టపర్తి బస్టాండ్లో సోమవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుగు ప్రయాణమైన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడుపుతూ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు చేపట్టారు.