VZM: ఇటీవల తరచుగా పలు దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో డెంకాడ మండలంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయ కమిటీ సభ్యులు నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై ఏ.సన్యాసి నాయుడు కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నిఘా నేత్రాలు ఏర్పాటు చేయడం వలన దొంగతనాలు అదుపులోకి తీసుకురావడమే కాకుండా, నేరగాళ్లను వెంటనే పట్టుకోవచ్చన్నారు.