AP: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు. ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన కన్నుమూశారని తెలిసి చింతించానని చెప్పారు. ధర్మేంద్ర కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు.