VSP: తెలుగు భాష మనుగడ కోసం విశాఖలో తెలుగుదండు సంకల్పించిన ‘టిట్టిభ సత్యాగ్రహం’ 15వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమం కవులు, కళాకారులు, భాషాభిమానుల సందడితో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా తెలుగుదండు అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తెలుగు భాష పట్ల ఖాతరు లేని విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.