WGL: పర్వతగిరి మండలం మూడేత్తుల తండా గ్రామంలో MLA నాగరాజు ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మూడు యాకునాయక్ మహిళా శక్తి సంఘ సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, మహిళా సంఘ సభ్యులు ఉన్నారు.