ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖారరైన విషయం తెలిసిందే. అయితే కొందరు ఆశావహులు సంతోషంలో మునిగితే, మరికొందరు నిరాశలో కూరుకుపోయారు. గత రిజర్వేషన్లను ఆధారంగా తీసుకుని తమకు అనుకూలంగా వస్తాయని ఆశించిన గ్రామస్థాయి నాయకులు ప్రజలకు చేదోడుగా ఉంటూ చిన్న పనులు చేస్తూ వచ్చారు. కానీ రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో నిరాశలో మునిగారు.