CTR: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కుప్పంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు. దేశ ఐక్యత, సంఘీభావం, జాతీయ సమగ్రతపై యువతలో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతపట్టి పటేల్‌ని స్మరించుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి టౌన్ బ్యాంక్ వరకు ర్యాలీ చేశారు.