NLR: ఉలవపాడు (M) కరేడు పంచాయతీలో రూ.16 లక్షలతో సీసీ డ్రైన్ పనులకు MLA ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు. పంచాయతీల అభివృద్ధికి CM పనిచేస్తుండగా, గత ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని MLA విమర్శించారు. స్థానికుల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందన్నారు.