చైనా షాంఘై పుడాంగ్ ఎయిర్ పోర్టులో భారత మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ చైనాదే అంటూ తన భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించేందుకు ఆ దేశ అధికారులు నిరాకరించారని ఆమె ఆరోపించారు. నవంబర్ 21న పెమా వాంగ్ జోమ్థాంగ్ డోక్ అనే మహిళ లండన్ నుంచి జపాన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే, ట్రాన్సిట్ హాల్ట్ కోసం ఆ విమానం చైనా నగరం షాంఘైలో దిగింది.