బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సంతాపం ప్రకటించారు. ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరన లోటని కొనియాడారు. దశాబ్దాల తరబడి అద్వితీయ నటనతో ధర్మేంద్ర అలరించారని, యువ నటులకు ధర్మేంద్ర స్ఫూర్తిగా నిలుస్తారని గుర్తుచేశారు.