AP: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తన మరపురాని ప్రదర్శనలతో లక్షలాది మంది హృదయాలను స్పృశించారని అన్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు గుర్తుండిపోతాయని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.