KMM: 18 ఏళ్లు నిండినవారు ఏటా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు చేయించుకోవాలని సూపర్వైజర్ నందిని సూచించారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో వైఆరికే ఆధ్వర్యంలో సోమవారం ఆమె హెచ్ఐవీ, టీబీ, సుఖ వ్యాధులపై అవగాహన కల్పించారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత రక్తం, సూదులు, తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్ సోకుతుందని వివరించారు.