మలేషియా పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి దక్షిణ అండమాన్‌లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 48 గంటల్లో వాయుగుండం బలపడనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. రేపు శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో దక్షిణ కోస్తాలో 4 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.