ASR: చింతపల్లి-2, చౌడుపల్లి-2 రైతు సేవా కేంద్రాల్లో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం భాగంగా వ్యవసాయ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ.. రైతులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తారని చింతపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు బీవీ తిరుమలరావు, ఏవో మధుసూధనరావు తెలిపారు. వ్యవసాయ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు.