MDK: చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామ చెరువులో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సిద్దిపేటకు చెందిన మహమ్మద్ హర్షద్ (40) గా గుర్తించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.