ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని, తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారని కొనియాడారు. ఇది ఎంతో విచారకరమైన సమయమని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మోదీ పేర్కొన్నారు.