ప్రకాశం: కంభంలోని చెక్ పోస్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.