JN: ఇటీవల దేవరుప్పుల ఎంపీడీవోగా నూతన బాధ్యతలు చేపట్టిన మేనకను మండల సీఐటీయూ నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. గ్రామాల అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, రామ్ చందర్, వెంకన్న, వెంకట్ రెడ్డి, ఉప్పలయ్య, తదితరులున్నారు.