TPT: శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు ఫారెస్ట్ చుట్టుపక్కల 144 సెక్షన్ విధించినట్లు తహశీల్దార్ జనార్ధన్ రాజు తెలిపారు. సింహాచల కండ్రిగ గ్రామానికి చెందిన కొంతమంది ఇనగలూరు రిజర్వ్ ఫారెస్ట్‌లో తోటల పనిని అడ్డుకుని సిబ్బందిని బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా నలుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడదని స్పష్టం చేశారు.